WELCOME TO political news PAGE
Showing posts with label political news. Show all posts
సూర్యా పేట జిల్లా లో సి.ఎస్. సోమేశ్ కుమార్ నేతృత్వం లో ఉన్నత స్థాయి బృందం పర్యటన..
జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఉన్నత స్థాయి సమీక్ష..
* *కొత్త కేసులు నమోదు కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి..
* *ప్రజలు ఆందోళన చెంద వద్దు : సి.ఎస్.సోమేశ్ కుమార్
* *జిల్లా కలెక్టర్ ,ఎస్.పి.నేతృత్వం లో కలిసి కట్టుగా పని చేయాలి, ప్రజలు లాక్ డౌన్ కు సహకరించాలి: డి జిపి మహేందర్ రెడ్డి
సూర్యా పేట-న్యూస్24అవర్స్, ఏప్రిల్ 22 : సూర్యా పేట జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు వ్యాప్తి చెందకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు.సూర్యాపేట జిల్లాలో ఎక్కువగా పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయిన నేపథ్యం లో రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్ర శేఖర్ రావు ఆదేశాల ననుసరించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో డి.జి.పి.మహేందర్ రెడ్డి,రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, ఐ జి ఇంటెలిజెన్స్ నవీన్ చంద్, ఐ జి .వెస్ట్ జోన్ స్టీ పెన్ రవీంద్ర,డైరెక్టర్ ఆప్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస్ లతో కూడిన ఉన్నత స్థాయి బృందం బుధ వారం సూర్యాపేట జిల్లా లో పర్యటించారు. జిల్లా కేంద్రం లో కొత్త గూడ కూరగాయల మార్కెట్ కంటేయిన్ మెంట్ ప్రాంతాన్ని పరిశీలించారు. కంటెయిన్ మెంట్ ప్రాంతంలో చేపట్టిన చర్యలు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి,జిల్లా ఎస్.పి. భాస్కరన్ లు వివరించారు.అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్,ఎస్.పి.అర్.డి. ఓ. లు,వైద్య,ఆరోగ్య శాఖ మెడికల్ ఆఫీసర్ లు, మున్సిపల్ కమిషనర్ లతో, కంటే యిన్ మెంట్ స్పెషల్ ఆఫీసర్ లతో సమావేశమై కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ గా నమోదైన నేపథ్యం లో కారణాలు,కొత్త కేసులు రాకుండా తీసుకో వలసిన చర్యల పై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా సి.ఎస్.సోమేశ్ కుమార్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో 83 పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయినట్లు,జిల్లా జనాబా సుమారు 13 లక్షలు వున్నదని,గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ జనాభా తో పోల్చితే సూర్యా పేట జిల్లాలో ఎక్కువ గా నమోదైనట్లు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తి నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు,ప్రజలు ఆందోళన చెంద వద్దని,జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారం అందిస్తామని తెలిపారు.కొత్త కేసులు నమోదు కాకుండా జిల్లా కలెక్టర్,ఎస్.పి.లు నేతృత్వం లో అన్ని శాఖలు కలిసి కట్టుగా కృషి చేయాలని అన్నారు ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను అభినందిస్తూ యంత్రాంగం కు సహకారం గా వుండేందుకు ఐ. ఏ.ఎస్.అధికారి సర్పరాజ్ అహ్మద్ ను ప్రత్యేక అధికారిగా, యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ని,డిప్యూటీ డి.ఎం.హెచ్ .ఓ.,ను, మున్సిపల్ పరిపాలన డిప్యూటీ డైరెక్టర్ ను ఓ.ఎస్.డి.గా నియమించినట్లు తెలిపారు. హెల్త్,రెవెన్యూ, మున్సిపల్,పోలీస్, వ్యవసాయ శాఖ,మార్కెటింగ్ శాఖలు పని చేస్తున్నారని,మెడికల్,రెవెన్యూ, మున్సిపల్ శాఖలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు.
పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రే సింగ్ పకడ్బందీగా చేయాలీ అన్నారు.నిన్న పాజిటివ్ వచ్చిన కేసుల నుండి మొదలు పెట్టాలని, పాత కేసులు రివ్యూ చేయాలని అన్నారు.ప్రతి ఒక్క కాంటాక్ట్ ట్రేస్ చేయాలని,పోలీస్ ,హెల్త్, మున్సిపల్ శాఖలు కలిసి కట్టుగ పనిచేయాలని,టెక్నాలజీ వినియోగించు కోవాలని అన్నారు.ప్రైమరీ కాంటాక్ట్ వున్న వారిని క్వారం టైన్ కు తరలించి పరీక్షలు నిర్వహించాలి,ప్రైమరీ కాంటాక్ట్ నూరు శాతం పరీక్షలు నిర్వహించాలని అన్నారు. పాజి టివ్ వస్తె గాంధీ కి తర లించాలని,నెగెటివ్ వస్తె నిర్దేశిత సమయం క్వారం టైన్ లో వుంచి, పూర్తి అయిన తర్వాత స్టాంప్ వేసి వేయాలని అన్నారు.
కంటే యిన్ మెంట్ ప్రాంతాలు మరింత గా పటిష్టం చేయాలి,ఆ ప్రాంతం నుండి ఎవ్వరూ బయటికి రాకుండా చూడాలి ,చీమ కూడా లోనికి పోవద్దు,బయటికి రావద్దని,అర్&బి శాఖ బారి కెడింగ్ ఇంకా పటిష్టం చేయాలని సూచించారు.కంటే యిన్ మెంట్ ప్రాంతం లో పబ్లిక్ అనౌన్స్ మెంట్ చేయాలని,స్థానిక తెలుగు,ఉర్దూ భాష లో చేయాలని,ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి బయటికి వాస్తే ప్రభుత్వ క్వా రం టై న్ కు తరలించాలని అన్నారు.ఆ ప్రాంతాలలో నిత్యావసర వస్తువుల సరఫరా,కూర గాయాల సరఫరా పక్కగా జరగాలి అన్నారు.సోడియం హైపో క్లోరైడ్ పిచి కారీ చేయాలని అన్నారు.అన్ని వాణిజ్య సంస్థలు మూసి వేయాలని అన్నారు.క్వారం టైన్ కేంద్రాలు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిర్వహించాలి,పారిశుధ్యం,ఆహారం,సామాజిక దూరం పాటించాలని అన్నారు.ప్రైమరీ కాంటాక్ట్ వారికి కేంద్ర ఆరోగ్య శాఖ,ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన నిబంధనలు అనుసరించాలి,వైద్య పరీక్షలు,మందులు ప్రొ టో కాల్ పాటించి అంద చేయాలని అన్నారు.రిపోర్టింగ్ చేయాలని అన్నారు.డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ ఇక్కడే వుండి మానిటర్ చేస్తారని అన్నారు.
డి.జి.పి
మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పాజీ టీవ్ కేసులు 83 కు విస్తరించి నట్లు,జిల్లా యంత్రాంగానికి నిర్దేశం చేసి సమీక్షించేందుకు సి.ఎస్.నేతృత్వం లో ఉన్నత స్థాయి బృందాన్ని ముఖ్య మంత్రి పంపించి నట్లు తెలిపారు.కరోనా మహమ్మారిని నియంత్రణ కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు,జిల్లా లో కూడా చాలెంజి గా తీసుకొని,ఒక టీమ్ గా పని చేసి వంద శాతం కట్టడి చేయాలని అన్నారు.ప్రజలు సహకరిస్తున్నారని,ప్రభుత్వ సూచనలు పాటిస్తూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.పోలీస్ శాఖ ద్వారా పూర్తి సహకారం అందిస్తామని అన్నారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్య దర్శి శాంతి కుమారి మాట్లాడుతూ క్వా రం టై న్ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య బృందాలు ప్రతి రోజూ ఇంటింటి సర్వే చేసి ఉదయం,సాయంత్రం వైద్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు.ప్రతి వారికి మాస్క్ లు అంద చేయాలని,ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రుల లో జ్వర పీడితుల కు ప్రత్యేకంగా పరీ క్షేంచెందుకు తగిన ఏర్పాటు చేయాలని అన్నారు.ప్రతి రోజూ రిపోర్టింగ్ చేయాలని అన్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల లో ఇన్ పెక్షన్ నిరోధ చర్యలు చేపట్టాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి,ఎస్.పి. భాస్క రన్ లు జిల్లా లో కరోనా నియంత్రణ కు తీసుకున్న చర్యలను వివరించారు.జిల్లాలో ఇప్పటి వరకు 83 పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయినట్లు,ఒకటి డిస్ చార్జీ అయినట్లు,82 ఆక్టివ్ కేసులు వున్నట్లు తెలిపారు.12 కాంటేయిన్మెంట్ ప్రాంతం లు ఏర్పాటు చేసి నట్లు తెలిపారు. ఏడు క్వారాం టైన్ కేంద్రాలు ఏర్పాటు చేసి నట్లు, ఏ విధంగా సంక్రమించింది,నియంత్రణకు తీసుకున్న చర్యలు వివరించారు.వచ్చే వారం రోజుల్లో కరోనా కేసులు వ్యాప్తి చెంద కుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Content Source : NEWS24HOURSTV
జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఉన్నత స్థాయి సమీక్ష..
* *కొత్త కేసులు నమోదు కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి..
* *ప్రజలు ఆందోళన చెంద వద్దు : సి.ఎస్.సోమేశ్ కుమార్
* *జిల్లా కలెక్టర్ ,ఎస్.పి.నేతృత్వం లో కలిసి కట్టుగా పని చేయాలి, ప్రజలు లాక్ డౌన్ కు సహకరించాలి: డి జిపి మహేందర్ రెడ్డి
సూర్యా పేట-న్యూస్24అవర్స్, ఏప్రిల్ 22 : సూర్యా పేట జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు వ్యాప్తి చెందకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు.సూర్యాపేట జిల్లాలో ఎక్కువగా పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయిన నేపథ్యం లో రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్ర శేఖర్ రావు ఆదేశాల ననుసరించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో డి.జి.పి.మహేందర్ రెడ్డి,రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, ఐ జి ఇంటెలిజెన్స్ నవీన్ చంద్, ఐ జి .వెస్ట్ జోన్ స్టీ పెన్ రవీంద్ర,డైరెక్టర్ ఆప్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస్ లతో కూడిన ఉన్నత స్థాయి బృందం బుధ వారం సూర్యాపేట జిల్లా లో పర్యటించారు. జిల్లా కేంద్రం లో కొత్త గూడ కూరగాయల మార్కెట్ కంటేయిన్ మెంట్ ప్రాంతాన్ని పరిశీలించారు. కంటెయిన్ మెంట్ ప్రాంతంలో చేపట్టిన చర్యలు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి,జిల్లా ఎస్.పి. భాస్కరన్ లు వివరించారు.అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్,ఎస్.పి.అర్.డి. ఓ. లు,వైద్య,ఆరోగ్య శాఖ మెడికల్ ఆఫీసర్ లు, మున్సిపల్ కమిషనర్ లతో, కంటే యిన్ మెంట్ స్పెషల్ ఆఫీసర్ లతో సమావేశమై కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ గా నమోదైన నేపథ్యం లో కారణాలు,కొత్త కేసులు రాకుండా తీసుకో వలసిన చర్యల పై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా సి.ఎస్.సోమేశ్ కుమార్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో 83 పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయినట్లు,జిల్లా జనాబా సుమారు 13 లక్షలు వున్నదని,గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ జనాభా తో పోల్చితే సూర్యా పేట జిల్లాలో ఎక్కువ గా నమోదైనట్లు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తి నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు,ప్రజలు ఆందోళన చెంద వద్దని,జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారం అందిస్తామని తెలిపారు.కొత్త కేసులు నమోదు కాకుండా జిల్లా కలెక్టర్,ఎస్.పి.లు నేతృత్వం లో అన్ని శాఖలు కలిసి కట్టుగా కృషి చేయాలని అన్నారు ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను అభినందిస్తూ యంత్రాంగం కు సహకారం గా వుండేందుకు ఐ. ఏ.ఎస్.అధికారి సర్పరాజ్ అహ్మద్ ను ప్రత్యేక అధికారిగా, యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ని,డిప్యూటీ డి.ఎం.హెచ్ .ఓ.,ను, మున్సిపల్ పరిపాలన డిప్యూటీ డైరెక్టర్ ను ఓ.ఎస్.డి.గా నియమించినట్లు తెలిపారు. హెల్త్,రెవెన్యూ, మున్సిపల్,పోలీస్, వ్యవసాయ శాఖ,మార్కెటింగ్ శాఖలు పని చేస్తున్నారని,మెడికల్,రెవెన్యూ, మున్సిపల్ శాఖలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు.
పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రే సింగ్ పకడ్బందీగా చేయాలీ అన్నారు.నిన్న పాజిటివ్ వచ్చిన కేసుల నుండి మొదలు పెట్టాలని, పాత కేసులు రివ్యూ చేయాలని అన్నారు.ప్రతి ఒక్క కాంటాక్ట్ ట్రేస్ చేయాలని,పోలీస్ ,హెల్త్, మున్సిపల్ శాఖలు కలిసి కట్టుగ పనిచేయాలని,టెక్నాలజీ వినియోగించు కోవాలని అన్నారు.ప్రైమరీ కాంటాక్ట్ వున్న వారిని క్వారం టైన్ కు తరలించి పరీక్షలు నిర్వహించాలి,ప్రైమరీ కాంటాక్ట్ నూరు శాతం పరీక్షలు నిర్వహించాలని అన్నారు. పాజి టివ్ వస్తె గాంధీ కి తర లించాలని,నెగెటివ్ వస్తె నిర్దేశిత సమయం క్వారం టైన్ లో వుంచి, పూర్తి అయిన తర్వాత స్టాంప్ వేసి వేయాలని అన్నారు.
కంటే యిన్ మెంట్ ప్రాంతాలు మరింత గా పటిష్టం చేయాలి,ఆ ప్రాంతం నుండి ఎవ్వరూ బయటికి రాకుండా చూడాలి ,చీమ కూడా లోనికి పోవద్దు,బయటికి రావద్దని,అర్&బి శాఖ బారి కెడింగ్ ఇంకా పటిష్టం చేయాలని సూచించారు.కంటే యిన్ మెంట్ ప్రాంతం లో పబ్లిక్ అనౌన్స్ మెంట్ చేయాలని,స్థానిక తెలుగు,ఉర్దూ భాష లో చేయాలని,ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి బయటికి వాస్తే ప్రభుత్వ క్వా రం టై న్ కు తరలించాలని అన్నారు.ఆ ప్రాంతాలలో నిత్యావసర వస్తువుల సరఫరా,కూర గాయాల సరఫరా పక్కగా జరగాలి అన్నారు.సోడియం హైపో క్లోరైడ్ పిచి కారీ చేయాలని అన్నారు.అన్ని వాణిజ్య సంస్థలు మూసి వేయాలని అన్నారు.క్వారం టైన్ కేంద్రాలు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిర్వహించాలి,పారిశుధ్యం,ఆహారం,సామాజిక దూరం పాటించాలని అన్నారు.ప్రైమరీ కాంటాక్ట్ వారికి కేంద్ర ఆరోగ్య శాఖ,ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన నిబంధనలు అనుసరించాలి,వైద్య పరీక్షలు,మందులు ప్రొ టో కాల్ పాటించి అంద చేయాలని అన్నారు.రిపోర్టింగ్ చేయాలని అన్నారు.డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ ఇక్కడే వుండి మానిటర్ చేస్తారని అన్నారు.
డి.జి.పి
మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పాజీ టీవ్ కేసులు 83 కు విస్తరించి నట్లు,జిల్లా యంత్రాంగానికి నిర్దేశం చేసి సమీక్షించేందుకు సి.ఎస్.నేతృత్వం లో ఉన్నత స్థాయి బృందాన్ని ముఖ్య మంత్రి పంపించి నట్లు తెలిపారు.కరోనా మహమ్మారిని నియంత్రణ కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు,జిల్లా లో కూడా చాలెంజి గా తీసుకొని,ఒక టీమ్ గా పని చేసి వంద శాతం కట్టడి చేయాలని అన్నారు.ప్రజలు సహకరిస్తున్నారని,ప్రభుత్వ సూచనలు పాటిస్తూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.పోలీస్ శాఖ ద్వారా పూర్తి సహకారం అందిస్తామని అన్నారు.
Image Courtesy: Namasthe Telangana |
జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి,ఎస్.పి. భాస్క రన్ లు జిల్లా లో కరోనా నియంత్రణ కు తీసుకున్న చర్యలను వివరించారు.జిల్లాలో ఇప్పటి వరకు 83 పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయినట్లు,ఒకటి డిస్ చార్జీ అయినట్లు,82 ఆక్టివ్ కేసులు వున్నట్లు తెలిపారు.12 కాంటేయిన్మెంట్ ప్రాంతం లు ఏర్పాటు చేసి నట్లు తెలిపారు. ఏడు క్వారాం టైన్ కేంద్రాలు ఏర్పాటు చేసి నట్లు, ఏ విధంగా సంక్రమించింది,నియంత్రణకు తీసుకున్న చర్యలు వివరించారు.వచ్చే వారం రోజుల్లో కరోనా కేసులు వ్యాప్తి చెంద కుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Content Source : NEWS24HOURSTV
సహా పంక్తి భోజనం చేసిన తెలంగాణ మునిసిపల్ శాఖ మంత్రి K T రామారావు
కరోనా వైరస్ ని మరింత వైప్తి చెందకుండా నిరంతరం పోరాడే విభాగం మునిసిపల్ కార్మికులు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో ముందుండి పోరాడుతున్న జీహెచ్ఎంసీ క్షేత్రస్థాయి సిబ్బందితో కలిసి సహపంక్తి భోజనం చేసిన మునిసిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు
Subscribe to:
Posts
(
Atom
)
Featured Post
Super Star Mahesh Not Part of "Devaki Nandana Vasudeva"
Super Star Mahesh Babu Not Part of "Devaki Nandana Vasudeva" Super Star Mahesh babu is not part of the upcoming film " Deva...