నాగచైతన్య-శోభిత ఎంగేజ్ మెంట్ తర్వాత అందరి చూపు సమంతపైనే పడింది. ఎందుకంటే? ఈ విషయంపై ఆమె ఎలాంటి పోస్ట్ చేస్తుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ చైతన్య ఎంగేజ్ మెంట్ గురించి సామ్ ఎలాంటి పోస్ట్ అయితే చేయలేదు. ఇదిలా ఉండగా.. సమంత గురించి ఇప్పుడో విషయం నెట్టింట తెగ వైరల్ గా మారింది. బాలీవుడ్ డైెరెక్టర్ రాజ్ నిడిమోరు తో సమంత ప్రేమలో పడినట్లు రెడిట్ ఓ కథనంలో తెలిపింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
సమంత.. ఏమాయ చేశావే మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను మాయ చేసి, వారి మనసు దోచింది. నాగచైతన్యతో ఆ మూవీ నుంచి ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. కాగా.. లేటెస్ట్ గా నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు విడాకుల తర్వాత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడింది. ఆ వ్యాధి నుంచి ప్రస్తుతం కోలుకుంది. అయితే చైతన్య నిశ్చితార్థంపై సామ్ ఏదో ఒక పోస్ట్ చేస్తుందని నెటిజన్లు భావించారు. కానీ వారి ఎంగేజ్ మెంట్ పై ఆమె ఎలాంటి పోస్ట్ చేయలేదు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. తాజాగా సమంతకు చెందిన ఓ న్యూస్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
సిటాడెల్.. హనీ బన్నీ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్న రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తోందని రెడిట్ ఓ కథనంలో పేర్కొంది. ఈ డైరెక్టర్ గతంలో తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ లో కూడా సామ్ నటించింది. దాంతో ఇద్దరి మధ్య స్నేహం చిగురించిందని, అది కాస్త ప్రేమకు దారితీసిందని రెడిట్ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం సమంత డేటింగ్ రూమర్లు నేషనల్ వైడ్ గా వైరల్ గా మారాయి. అయితే ఈ రూమర్లపై ఇప్పటి వరకు ఇద్దరిలో ఎవరూ కూడా స్పందించలేదు. కాగా.. రాజ్ కు ఇదివరకే పెళ్లి అయ్యింది. మరి సమంత డేటింగ్ రూమర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.